కాంగ్రెస్ వివక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి- మోడీ

by Dishanational6 |
కాంగ్రెస్ వివక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్, ఇండియా కూటమి విభజన, వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ప్రధాని మోడీ కోరారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మోడీ లేఖ రాశారు. ఇండియా కూటమి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటర్లను చైతన్యవంతుల్ని చేయాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవడమే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. అలా ఓటు బ్యాంకు రిజర్వేషన్లు సంపాదించడమే కాంగ్రెస్ పని అని ఎద్దేవా చేశారు. ఈ లేఖన్ కేంద్రఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ప్రజల కష్టార్జితాన్ని లాక్కొని ఓటు బ్యాంకు సంపాదించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వారసత్వపు పన్ను లాంటి ప్రమాదకమైన ఆలోచనలకు మద్దతిస్తామని కాంగ్రెస్ కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అలాంటి వాటిని అరికట్టేందుకు అందరూ ఏకం కావాలని మోడీ చెప్పారు.

బీజేపీకి వచ్చే ప్రతిఓటు కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే జరిగిన రెండు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ విజన్ కు మద్దతు ఇచ్చేందుకు తోడ్పడ్డారని అన్నారు.

పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ప్రజలను ప్రేరేపించడం ముఖ్యమని కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో గెలుపుపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి బూత్‌లో విజయం సాధిస్తే.. నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థే గెలిచేందుకు దారితీస్తుందన్నారు. అదేసమయంలో వారి ఆరోగ్యం, చుట్టుపక్కల వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మోడీ కార్యకర్తలకు సూచించారు.

Next Story