Minister Ponguleti Srinivas Reddy : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు లేకుండా చేస్తాం : మంత్రి పొంగులేటి

by Muthe.Rajitha |

తెలంగాణలో మరో రెండు నెలల్లో భూసమస్యలు అనేవే లేకుండా చేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు.

Minister Ponguleti Srinivas Reddy : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు లేకుండా చేస్తాం : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మరో రెండు నెలల్లో భూసమస్యలు అనేవే లేకుండా చేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. నేడు జనగామ జిల్లాలోని పాలకుర్తిలో పర్యటించిన మంత్రి పొంగులేటి.. భూసమస్యలపై క్లారిటీ ఇచ్చారు. భూభారతి(Bhubharati)తో అన్ని రకాల రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆగస్టు 15 నాటికి భూసమస్యలను పూర్తిగా పరిష్కరిస్తారమని ఆయన హామీ ఇచ్చారు. జూన్ 3 నుంచి 20 వరకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని తెలిపిన మంత్రి.. మొత్తం రెవెన్యూ వ్యవస్థ గ్రామాలకు వస్తుందని, ప్రతీ సమస్యను అక్కడే తీరుస్తుందని అన్నారు.

ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని.. అంతా ఉచితంగానే జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాల్లో శిక్షణ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ముందు ముందు రోజుల్లో అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియ జేశారు.

Next Story