Kavitha : పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించం : కవిత

by Y. Venkata Narasimha Reddy |

తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Kavitha : పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించం : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కొల్లాపూర్ (Kollapur)నియోజకవర్గంలో కవిత(Kavitha)పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తలపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి చేసిన వీరంగం స్పష్టించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జల పరమేశ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో రాత్రి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొంది, ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు.

పరమేశ్‌ను కవిత పరామర్శించారు. దాడి చేస్తున్న సమయంలో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదంటూ ఆమె హెచ్చరించారు.

కొల్లాపూర్ పర్యటనలో కవిత సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కవిత పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మరోసారి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

Next Story