- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti Srinivas Reddy : తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తాం : పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల(Indiaramma Houses)ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. తల తాకట్టు పెట్టైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామనిఅన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాతే ప్రజల నుంచి ఓట్లు అడుగుతామని ప్రకటించారు.
మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటివరకు 2.65 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చామని, 71 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, 3 వేల ఇళ్లు గోడలు, శ్లాబ్ దశకు చేరాయని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల దరఖాస్తులు రాగా, 16.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 400 నుంచి 600 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేస్తే బిల్లులు వెంటనే చెల్లిస్తామని, పేదల కలలను నెరవేర్చడమే లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.
అసంపూర్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే, లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇచ్చి, వారే నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సొంత జాగా లేని అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు.






