'వరంగల్' ను రాష్ట్ర రెండో రాజధానిగా.. అభివృద్ది చేస్తాం! మంత్రి పొంగులేటి

by Geesa Chandu |   (  Updated:2024-08-16 15:06:18  IST  )

వరంగల్ ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా.. అభివృద్ది చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఉమ్మడి వరంగల్ ఇంఛార్జ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా.. అభివృద్ది చేస్తాం! మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ది చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఉమ్మడి వరంగల్ ఇంఛార్జ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గురువారం వరంగల్ లో జరిగిన ఉత్సవాలకు హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి మంత్రి మాట్లాడుతూ.. "2050 జనాభాను దృష్టిలో ఉంచుకొని వరంగల్ మాస్టర్ ప్లాన్ ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ లో ఫార్మాసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, విద్యా సంస్థలు, ఎకో టూరిజం, స్టేడియం, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ తో పాటు టూరిజం ను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. నర్సంపేట లో ఈ ఏడాది నుంచే మెడికల్ కాలేజీ, ఆసుపత్రి సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వరంగల్ లో భారీ వర్షాలు పడ్డప్పుడు వచ్చే వరదల వలన, ముంపు సమస్యలు రాకుండా భారీ నాలాలను నిర్మిస్తామని అన్నారు. రూ. 80 కోట్లతో వరంగల్ కలెక్టరేట్ పనులను చేపడుతున్నట్లు, వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు" మంత్రి పొంగులేటి.

Next Story