- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MIM: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై అసదుద్దీన్ ఒవైసీ క్లారిటీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు కావడంతో నోటిఫికేషన్ వెలువడమే తరువాయిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఈ క్రమంలో ఈఎన్నికల్లో పోటీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని దారుస్సలాంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంఐఎం టికెట్ల కోసం ఆశావహులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు ఇచ్చామని ఈ విషయంలో కసరత్తు కూడా మొదలైందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని డెఫినెట్‍గా ఎంఐఎం బరిలో ఉంటుందన్నారు.
మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు:
మహారాష్ట్రలో నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 125 సీట్లు గెలుచుకుంది. ఈ భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. BJP, NDAతో ఎలాంటి కూటమీ లేదని ఆయన స్పష్టం చేశారు. BJP అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఎంఐఎం సభ్యులను సస్పెండ్ చేశామని తెలిపారు. ఒడిషాలోని బాలాసోర్‌లో SK ముహమ్మద్ అనే యువకుడిపై గో రక్షకులు చేసిన దాడిని ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, చట్ట వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో AIMIM అన్ని సీట్లలో పోటీ చేస్తుందని పూర్తి శక్తితో పోరాడుతుందని ప్రకటించారు.






