- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాల్లో దేశ జనాభా లెక్కల(Census)తోపాటు, కులగణన(Cast Census) కూడా చేపట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాల్లో దేశ జనాభా లెక్కల(Census)తోపాటు, కులగణన(Cast Census) కూడా చేపట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర కులాలను పరిగణనలోకి తీసుకునేవారు కాదని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దీంతో రాహుల్ గాంధీ విజన్ నెరవేరబోతోందని అన్నారు.
దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన(Telangana Cast Census0 చేశామని, ఇది స్వతంత్ర దేశంలోనే మొదటిదని, తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శం అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించడం జరిగిందని.. జనాభాలో 56.32 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందినవారని తేలిందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీలో ఆమోదముద్ర వేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అంగీకరించాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలియజేశామని గుర్తు చేశారు.






