- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : మేడిగడ్డ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలని కోరాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ టూర్లో ఉన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రులను కలిసి చర్చించేందుకు, మంత్రి ఉత్తమ్ కుమార్(Uthham Kumar Reddy) తో కలిసి సీఎం సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం.. కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్(CR Patil) తో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సమావేశం అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కేంద్రమంత్రితో మాట్లాడుతూ.. కృష్ణా జలాల(Krishna Water) వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వివరించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పాటిల్ కు విన్నవించారు.
సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో బేటీ వివరాలు తెలియజేశారు. కృష్ణా జలాల్లో కేటాయించిన దానికంటే ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బంకచర్ల(Bankacharla)పై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి(Medigadda Barrage) కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా త్వరగా అందించాలని కోరామన్నారు. అదేవిధంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విన్నవించామని, వీటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు.






