బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చాం.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ గట్టి పోటీనిచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు షేర్ పెరుగుతోందని, సంస్థాగతంగా పార్టీ బలపడుతోందని చెబుతూ.. రాబోయే హైదరాబాద్ ఎన్నికల్లో తమ ప్రభావం ఊహించని విధంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చాం.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు గట్టి పోటీనిచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజలు తమను గుర్తించారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని, సంస్థాగతంగా బీజేపీ బలపడటం సంతోషకరమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, అదే సమయంలో బీజేపీ ఓటు షేర్ పెరుగుతోందని విశ్లేషించారు. రాబోయే హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ ప్రభావం ఉండబోతోందని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.

ఇక జనసేన పార్టీతో పొత్తుపై తాము ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని.. అనారోగ్యం వల్లే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేకపోయారని రాంచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న విమర్శలను కొట్టిపారేస్తూ.. మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లాయని, బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Next Story