కౌశిక్ రెడ్డి పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన

by Ajay Maddhiboyina |

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగిన సమ్మక్కసారక్క జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కౌశిక్ రెడ్డి పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగిన సమ్మక్కసారక్క జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతర ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న విజయానంద్ రెడ్డితో కౌశిక్ రెడ్డికి విభేదాలు ఉండటంతో ఇరు వర్గాల మధ్యల గొడవలు జరిగే సూచనలు కనిపించడంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జాతరకు వెళ్లే సమయంలోనూ కౌశిక్ రెడ్డిని పోలీసులు రోడ్డుపైనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా పార్టీ ఖండించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణా రావు ప్రకటన చేశారు. ​సొంత మండలమైన వీనవంకలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జాతర ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం జరిగిందని తెలిపారు.

ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా, శాసనసభ సభ్యుడిగా కౌశిక్ రెడ్డి గారికి ప్రజా ప్రదేశాలను, ముఖ్యంగా మతపరమైన మరియు సాంస్కృతిక మహా కార్యక్రమాలను సందర్శించడం ఒక బాధ్యతగా, విధిగా ఉంటుందన్నారు. సమ్మక్క జాతర వంటి మహత్తరమైన జాతర సందర్భంగా ప్రజల ఇబ్బందులు తెలుసుకొని, సంబంధిత అధికారులకు సూచనలు చేయడం ప్రజాప్రతినిధి యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ విధిని నిర్వర్తించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. ​ఎమ్మెల్యేకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రోటోకాల్‌ను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిల్లా పార్టీ స్పష్టం చేస్తోందన్నారు. ​ఈ ఘటనపై సంబంధిత అధికారులు పునఃసమీక్ష చేయాలని, ప్రజాప్రతినిధుల విధులు మరియు బాధ్యతలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా కమిటీ కోరుతోందని తెలిపారు.

Next Story