- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: దసరా నాడు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం: కిషన్ రెడ్డి
రాష్ట్ర రైల్వేలలో వచ్చే నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు చేసి చూపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 103 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బేగంపేట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. ఎంఎంటీఎస్ రెండో ఫేస్ ను ప్రధాని మోడీ (MODI) ప్రారంభిస్తారని యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామన్నారు. దసరా రోజు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ను (Komuravelli Railway Station) ప్రారంభిస్తామని తెలిపారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే ఆ కార్యక్రమానికి మాజీ సీఎం రాకపోగా ఆయన కుమారుడు నన్ను విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రూ.80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్లాన్లు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాబోయే నాలుగేళ్లలో విప్లవాత్మక కార్యక్రమాలు రాష్ట్రంలో చేసి చూపుతామన్నారు. అనేక రైల్వే స్టేషన్లలో పనులకు భూసేకరణ సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని 2026 లో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్ (Begumpet Railway Station) లో అన్ని విభాగాల్లో మహిళా సిబ్బందే ప్రజలకు సేవలు అందించబోతున్నట్లు చెప్పారు.






