- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ఎవరికీ B టీమ్ కాదు.. జైరాం రమేష్‌కు కేటీఆర్ కౌంటర్
బీఆర్ఎస్ ఏ పార్టీకి B టీమ్ కాదని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఏ పార్టీకి B టీమ్ కాదని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఎక్స్ లో చేసిన పోస్టుకు కౌంటర్ గా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో "గత దశాబ్ద కాలంగా పార్లమెంటులో బిజెపికి (BJP) అండగా నిలిచిన రెండు పార్టీలు రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి?" అని జైరాం రమేష్ ఎక్స్ లో బీఆర్ఎస్, బీజేడీ పార్టీలను ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు. దానిపై స్పందించిన కేటీఆర్.. జైరామ్ జీ.. ఈ అహంకారమే కాంగ్రెస్ పార్టీని సమకాలీన రాజకీయాల్లో విఫలమయ్యేలా చేసిందన్నారు.
మీరు మాతో ఉన్నారా లేక వారితో ఉన్నారా అనే వాదన మంచిది కాదని సూచించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఏ పార్టీకి B టీమ్ కాదని, తాము తెలంగాణ ప్రజలకు A టీమ్ అని తెలిపారు. తమ గురించి వదిలేసి.. సొంత పార్టీలోఉన్న వైఫల్యాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ జైరామ్ రమేష్ కు సూచించారు.






