సంక్షేమ హాస్టళ్లను చక్కదిద్దుతున్నాం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​

by Kema Shiva Kumar |

ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద పిల్లలను ఆదుకుంటున్నామని, పేదల పిల్లలకు మంచి చదువు చెప్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సంక్షేమ హాస్టళ్లను చక్కదిద్దుతున్నాం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద పిల్లలను ఆదుకుంటున్నామని, పేదల పిల్లలకు మంచి చదువు చెప్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఏ సంక్షేమ హాస్టల్‌కు వెళ్లినా వెళ్లి పరిశీలించడానికి సిద్ధమని హరీష్ రావుకు ఆయన సవాల్ విసిరారు. ప్రతిరోజూ ఓ అధికారి సంక్షేమ హాస్టల్స్‌కు వెళ్లి పరిశీలించేలా యాక్షన్ ప్లాన్ చేశామని, సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఎఎస్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాలపై హరీష్ రావు రాజకీయాలు చేయడం దారుణమని, పేద దళిత, బీసీ పిల్లలతో రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. కుటుంబ తగాదాలతో హరీష్ రావు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని, ఆయనకు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నడూ గురుకులాలను పట్టించుకోలేదని, ఇరిగేషన్ కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి కమిషన్లు దండుకున్న ఆయన పేదల పిల్లల గురించి ఆలోచించలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. తాము పెండింగ్‌లో ఉన్న డైట్ ఛార్జీలను క్లియర్ చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్​ఆరోపించారు. కొన్ని చోట్ల పెండింగ్ జీతాలు ఉన్న మాట వాస్తవమే అని, నెలాఖరుకు అంతా క్లియర్ చేస్తామని అన్నారు. గ్రీన్ ఛానల్‌లో జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, రూ.200 శాతం డైట్ ఛార్జీలు పెంచామని, డైట్ క్యాలెండర్ ఇచ్చామని మంత్రి లక్ష్మణ్​కుమార్​తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్​హాయాంలో గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించలేదని, ఇప్పటికి అనేక చోట్ల అద్దె భవనాల్లోనే సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ పదేళ్లలో ఏ నాడైనా పేదల పిల్లలతో కలిసి భోజనం చేశారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మూడు సార్లు హాస్టల్ పిల్లలతో కలిసి భోజనం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి వేళ దండ వేయని చరిత్ర కేసీఆర్‌ది అని ఆయన విమర్శించారు. దళితులు, బీసీలు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్​అన్నారు.

Next Story