- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఇవాళ మాసబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ (Minister Adluri Laxman) కుమార్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రూనాయక్, ఎంపీ గోడెం నగేష్, ఆదివాసి గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలకు రోడ్లు, వంతెనలు అవసరమని అన్నారు. కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడం వల్ల చాలామంది గర్భిణులు ప్రసవ వేదనను అనుభవించారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని అన్నారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియాలు వెనకబాటుతో మగ్గిపోతాయని తెలిపారు. అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని సూచించారు. గిరిజనుల్లో చాలామందికి ఉండటానికి ఇండ్లు కూడా లేవని.. కాబట్టి ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్ ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సీతక్క తెలిపారు.
గిరిజన సంక్షేమంలో లోపాలున్నాయి.. మంత్రి అడ్లూరి
రాష్ట్రంలో గిరిజన సంక్షేమం విషయంలో లోపాలు ఉన్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) అన్నారు. ఐదేళ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ ఈ సమావేశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎస్టీల కష్టసుఖాలను చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి అందరూ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టి్కి తీసుళ్తామని స్పష్టం చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికి మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వబోమని మంత్రి అడ్లూరి లక్షణ్ అన్నారు.






