బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నాం: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-24 05:20:59  IST  )

కర్నూల్ జిల్లా‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటన తనను తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నాం: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లా‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటన తనను తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రమాదంపై ఆరా తీశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే రవాణా‌శాఖకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో ఫోన్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుందని.. ఇలాంటి నిబంధనలను కఠినతరం చేస్తాం. బస్సులపై రోజువారీ రవాణా శాఖ తనిఖీలు చేపడుతుంటే వేధింపులు అంటున్నారని.. వదిలేస్తే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టామన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Read More: కర్నూలు ప్రమాదం.. గద్వాల కలెక్టర్, ఎస్పీ పరామర్శ

కర్నూల్ బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

Next Story