రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

by Bhanu |

వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
X

దిశ, గీసుగొండ: వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రమణ (28) శనివారం మధ్యాహ్నం పనిమీద ద్విచక్ర వాహనంపై వరంగల్ వెళ్లి, రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మొగిలిచర్ల నుంచి మెయిన్ రోడ్డుకు వస్తున్న సమయంలో, ఎండి షఫీ అనే వ్యక్తి నడుపుతున్న గూడ్స్ వాహనం ఒక్కసారిగా ఎడమవైపు మలుపుతిరగగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న రమణ వాహనానికి ఢీకొనడంతో కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తలకు, కుడిపాదానికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని వెంటనే సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో రమణ మృతిచెందాడు. మృతుడి తండ్రి కొత్తపల్లి బిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story