ప్రేమ వైఫల్యం...క్షణికావేశం..ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

by Bhanu |

ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రేమ వైఫల్యం...క్షణికావేశం..ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
X

దిశ‌, ఏటూరునాగారం: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలిసుల క‌థ‌నం మేర‌కు..నూగూరు వెంక‌టాపురం మండ‌లం బెస్త‌గూడెం గ్రామానికి చెందిన బేగ విజ‌య్‌(22)అనే యువ‌కుడు వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ ప‌ని చేస్తూ జీవ‌నం గడిపే వాడు.


గ‌త నాలుగు నెల‌లుగా ఒక అమ్మాయిని ప్రేమించిన విష‌య‌మై దిగులుగా ఉండేవాడ‌ని, కుటుంబ స‌భ్యులు ప్రేమించిన అమ్మాయి వివ‌రాలు అడిగిన కూడా చెప్ప‌కుండా బాధ‌ప‌డేవాడ‌ని ఈ క్ర‌మంలోనే సోమ‌వారం రోజున రాత్రి ఒక్క‌డే ఇంటి బ‌య‌ట ప‌డుకున్నాడ‌ని తెల్ల‌వారుజామున కుటుంబ సభ్యులు లేచి చూసేస‌రికి విజ‌య్ ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలిసులు తెలిపారు. కాగా మృతుడు బేగ విజ‌య్ తండ్రి బేగ స‌మ్మ‌య్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్బాప్తు చేస్తున్నట్లు వెంక‌టాపురం పోలిసులు తెలిపారు.


Next Story