- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..
by Bhanu |
మద్యానికి బానిసై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, నెక్కొండ: మద్యానికి బానిసై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పిట్టకాలు బోడు తండాకు చెందిన బానోతు.రంజిత్ (28 సం"లు) హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు.సుమారు ఆరు నెలల కిందట అతని భార్య ఉరి వేసుకొని మరణించించింది.ఆ కేసులో రంజిత్ జైలుకు పోయి వచ్చాడు.అప్పటినుండి మానసికంగా యిబ్బంది పడుతూ,తాగుడుకు బానిసైనాడు.ఆవేదనలో గ్రామ సమీపంలోని మారేటికుంట కట్ట మీద ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గడ్డిమందు సేవించాడు.గమనించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు ఎస్సై తెలిపారు.మృతుడి సోదరుడు బానోతు.రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
Next Story






