- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు జవాబుదారీగా పని చేస్తా.. డోర్నకల్ ఎమ్మెల్యే
నియోజకవర్గం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని ఎమ్మెల్యే డా.జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.

దిశ, దంతాలపల్లి : నియోజకవర్గం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని ఎమ్మెల్యే డా.జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. సోమవారం డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన లక్ష్మినరసింహ, శివాలయములో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రామచంద్రు నాయక్ కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి పథంలో ఇంకెన్నో కొత్తపుంతలు తొక్కలనే ఉద్దేశంతో మార్పు కోరి భారీ మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతామని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి తనకు సహకరించిన అధికారులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భట్టు నాయక్, కాంగ్రెస్ నాయకులు పొన్నోటి బాలాజీ, ఎంపీటీసీలు నెమ్మది యాకన్నా, కొమ్మినేని సతీష్, సర్పంచ్ దర్శనలా సుష్మిత రవీందర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు తండ చిన్న రాములు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రమేష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు యాసిన్ పాషా, నాయకులు హరికృష్ణ, కసిరెది నవీన్ రెడ్డి, సెగ్యం గణేష్, మండల యూత్ అధ్యక్షుడు బెల్లి సంపత్, ఆవుల సురేష్ ఏరుకొండ యాకన్నా, వల్లపు లోకేష్, రమేష్, మురికి అనిల్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






