- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాడీ..బయటికి రా ప్లీజ్..!
తన భర్తను తనకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగింది. తన రెండున్నరేళ్ల పాపతో

దిశ, నర్సంపేట: తన భర్తను తనకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగింది. తన రెండున్నరేళ్ల పాపతో శుక్రవారం రాత్రి నుంచి గేటు దగ్గరే నిరసన తెలిపింది బాధిత వివాహిత. ఇక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గురిజాలకు చెందిన పోటు రవి కుమార్ కు భూపాలపల్లికి చెందిన రాధికతో 2021లో వివాహం జరిగింది. ఈ క్రమంలో రూ.50 లక్షల కట్నం సైతం అందజేసినట్లు తెలిపారు.
ఇరువురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మొదటగా బెంగుళూరులో నివాసం ఉన్నారు. కొన్ని నెలల తర్వాత ఇరువురి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అత్తింటి తరుఫు బంధువులు సమస్యను జఠిలం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రేరేపిస్తున్నట్లు తెలిపారు. తనకు, రెండున్నర ఏండ్ల పాపకు దిక్కెవరని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్ళేదిలేదని అక్కడే కూర్చుంది. గత రాత్రి నుండి చిన్న పాపతో అత్తింటి గేటు దగ్గర కూర్చుండటం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.






