వరంగల్‌ లో ఇన్‌స్పెక్టర్ సస్పెండ్..

by Bhanu |   (  Updated:2025-05-20 12:44:48  IST  )

మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జె. వెంకట రత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్‌ లో ఇన్‌స్పెక్టర్ సస్పెండ్..
X

దిశ, హనుమకొండ : మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జె. వెంకట రత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ వెంకట రత్నం పై ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా, కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు మరో కేసులో ఓ మహిళ నిందితురాలిని స్టేషన్ పరిధిలో లైంగికంగా వేధించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అంశాలపై జరిగిన అంతర్గత విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

Next Story