- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగూడలో యూరియా సబ్‌సెంటర్ ప్రారంభం
“కన్నీరు పెట్టిస్తున్న యూరియా” అనే శీర్షికతో దిశ పత్రికలో ప్రత్యేక కథనం

కొత్తగూడలో యూరియా సబ్‌సెంటర్ ప్రారంభం
- “కన్నీరు పెట్టిస్తున్న యూరియా” అనే శీర్షికతో దిశ పత్రికలో ప్రత్యేక కథనం
- స్పందించిన మంత్రి సీతక్క.. యూరియా సెంటర్ ఏర్పాటు
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు అధికారులను కదిలించాయి. ఇప్పటివరకు యూరియా సరఫరా కోసం పోగుళ్లపల్లి గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘానికే ఆధారపడాల్సి రావడంతో, మండల కేంద్రానికి దూరంగా ఉన్న రైతులు తీవ్ర కష్టాలు అనుభవించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత మరింత పెరిగింది. కొద్దిపాటి సరఫరా వచ్చినా రైతులు పెద్ద క్యూలలో నిలబడి, శారీరకంగా ఇబ్బందులు పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యపై “కన్నీరు పెట్టిస్తున్న యూరియా” అనే శీర్షికతో దిశ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రైతుల సౌకర్యార్థం కొత్తగూడ మండల కేంద్రంలోనే వ్యవసాయ సహకార సంఘం యూరియా సబ్‌సెంటర్ ప్రారంభించారు. దీంతో ఇకపై రైతులకు ఎరువుల కోసం దూర ప్రయాణం అవసరం లేకుండా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి.రైతులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ, సబ్‌సెంటర్ ఏర్పాటు తమకు ఊరటనిచ్చిందని అభిప్రాయపడ్డారు.






