రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి..

by Bhanu |

తొర్రూరు పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి..
X

దిశ, పాలకుర్తి : తొర్రూరు పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వి రమేష్ (42) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై బస్టాండ్‌కి వెళ్లి తిరిగి అన్నారం రోడ్డులోని ఇంటికి వస్తుండగా, జఫర్గడ్ మండలానికి చెందిన జువారి బన్నీ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయమై చెవిలో నుండి రక్తస్రావం సంభవించింది. స్థానికులు వెంటనే అతన్ని వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా మంగళవారం చికిత్స పొందుతూ రమేష్ ప్రాణాలు కోల్పోయాడు.మృతుడి అన్న సర్వి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.

Next Story