ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి..

by Bhanu |

ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని రాయకుంటకు వేళ్ళే రహదారి లో చోటుచేసుకుంది.

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి..
X

దిశ, వర్థన్నపేట : ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని రాయకుంటకు వేళ్ళే రహదారి లో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కట్రియాల గ్రామానికి చెందిన ఇటికాల రవి(40)అనే వ్యక్తి గత కొంత కాలంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.మృతుడికి భార్యతో పాటు కూతురు కుమారుడు ఉన్నారు.ఈ క్రమంలోనే కుటుంబాన్ని పోషించడం కోసం డ్రైవర్ గా పని చేస్తున్నారు.ఈ తరుణంలో రోజులాగానే పని నిమిత్తం కట్రియాల గ్రామం నుంచి ఇల్లందు గ్రామం మీదుగా రాయకుంట రోడ్డు మార్గం వైపు వేళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ ఇటికాల.రవి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడిని నిరుపేద కుటుంబం కావడంతో పేద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టెలా చేశాయి..


Next Story