- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట పొలాల్లో పైపుల దొంగలు.. రైతులు తీవ్ర ఆందోళన
by Batti.Sumithra |
మండలంలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలో ఈదుల చెరువు సమీపంలోని రైతుల పొలాల్లో పైపులను గుర్తుతెలియని దొంగలు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, బయ్యారం : మండలంలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలో ఈదుల చెరువు సమీపంలోని రైతుల పొలాల్లో పైపులను గుర్తుతెలియని దొంగలు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రైతు పోరళ్ల ఉపేందర్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి తమ వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి చూడగా, మోటార్ నుంచి వెళ్లే మడత పైపులు కనిపించలేదని, వాటిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలిపారు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నోటి కాడికి వచ్చిన పంటను కాపాడుకోవాలంటే దొంగల భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరైనా కావాలని చేసిన పనినా, లేక దొంగల పనేనా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు.
Next Story






