Medaram Jatara 2026: మేడారంలో దొంగల హల్చల్..!

by Ajay Maddhiboyina |

మేడారం తల్లుల దర్శనం కోసం ఆశగా వస్తున్న భక్తులకు దొంగలు నిరాశ కలిగిస్తున్నారు. డబ్బా ఫోన్లు మొదలు..ఐ ఫోన్ లు, బంగారు చైన్లు, వెండి పట్టీలు సహా నగదును క్షణాల్లో కొట్టేస్తున్నారు.

Medaram Jatara 2026: మేడారంలో దొంగల హల్చల్..!
X

దిశ, మేడారం నెట్వర్క్: మేడారం తల్లుల దర్శనం కోసం ఆశగా వస్తున్న భక్తులకు దొంగలు నిరాశ కలిగిస్తున్నారు. డబ్బా ఫోన్లు మొదలు..ఐ ఫోన్ లు, బంగారు చైన్లు, వెండి పట్టీలు సహా నగదును క్షణాల్లో కొట్టేస్తున్నారు. మేడారం గద్దెలకు దగ్గరలో గల రెండో గేటు దగ్గర ఓ వృద్ధుడు ఫోన్లు దొంగతనానికి పాల్పడుతున్నాడు. గమనించిన ఓ భక్తుడు అతన్ని పోలీసులకు అప్పజెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. కాగా సదరు వ్యక్తి దగ్గర రెండు ఫోన్లు సహా అప్పగించిన వ్యక్తి చార్జర్ మాత్రమే దొరికింది. దీంతో అతన్ని స్టేషన్ కి తీసుకెళ్లారు. జంపన్న వాగు దగ్గర రూ.10వేలు సహా గోల్డ్ చైన్ దొంగిలించినట్లు అన్నదమ్ములు పోలీసులను ఆశ్రయించారు. దొంగలు ముఠాగా ఏర్పడి తిరుగుతున్నారని, జాగ్రతగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Next Story