టీచర్ మందలించాడని విద్యార్థి అదృశ్యం

by Ratna Kumari |

హుజురాబాద్ పట్టణంలోని వీణవంక మహాత్మా జ్యోతిభా పూలే బీసీ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది.

టీచర్ మందలించాడని విద్యార్థి అదృశ్యం
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలోని వీణవంక మహాత్మా జ్యోతిభా పూలే బీసీ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మందలించాడనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థి శశాంక్ పాఠశాల నుండి అదృశ్యం కావడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థి తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు పాఠశాల గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. బాధిత విద్యార్థి శశాంక్ ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్, శశాంక్‌ను తీవ్రస్థాయిలో మందలించారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన శశాంక్, ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయాడు. విద్యార్థి కనిపించకుండా పోయిన విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

​విద్యార్థి అదృశ్యమైన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలోనూ, గాలింపు చర్యలు చేపట్టడంలోనూ ప్రిన్సిపాల్ సంపత్ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థి ది హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంగా తెలిపారు. ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడుతూ, శశాంక్ తల్లిదండ్రులు,విద్యార్థులు పాఠశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. అదృశ్యమైన విద్యార్థి ఆచూకీని వెంటనే కనిపెట్టాలని, విద్యార్థి మనస్తాపానికి కారణమైన గణిత ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.​విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌పై విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు.

Next Story