- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
- ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- నగరంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
దిశ, వరంగల్ బ్యూరో : నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – “సగటు ఉపాధ్యాయుడికి గౌరవం ఇవ్వడం అంటే రాబోయే తరానికి సన్మానం చేసినట్టే” అని పేర్కొన్నారు.
ప్రైవేట్ టీచర్ల సమస్యలపై హామీ
ప్రైవేట్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. “స్థానిక ఎమ్మెల్యేగా నా పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే” అని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి అనిల్ కుమార్, కూర వెంకట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు, కూరపాటి రమేష్, మజీద్ కమిటీ సభ్యులు డోలి రాజు, ముకుందం, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, చంద్ర మోహన్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాపర్తి సుజాత, అస్మా బేగం, అనిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.






