- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల కోసం కదిలిన జిల్లా యంత్రాంగం..
రైతులకు యూరియా సరఫరా సజావుగా సాగేందుకు మహబూబాబాద్ జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు.

రైతుల కోసం కదిలిన జిల్లా యంత్రాంగం..
- మరమ్మతుతో ఆగిన యూరియా లారీ
- హుటాహుటిన స్పందించిన కలెక్టర్ అద్వైత్ కుమార్
- కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్
- త్వరితగతిన రిపేర్ చేయించి సిరోల్ కు తరలింపు
- హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు
దిశ, డోర్నకల్/మరిపెడ: రైతులకు యూరియా సరఫరా సజావుగా సాగేందుకు మహబూబాబాద్ జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం గోదాం నుంచి సీరోల్ మండలానికి బయల్దేరిన యూరియా లారీ కురవి సమీపంలో బ్రేక్‌డౌన్ కావడంతో సమస్య తలెత్తింది. వెంటనే సమాచారం అందుకున్న కలెక్టర్ అద్వైత్ కుమార్ హుటాహుటిన స్పందించారు. రిపేర్‌కు 12 గంటలు పడుతుందని టెక్నీషియన్లు తెలిపిన నేపథ్యంలో, కలెక్టర్ సూచనలతో అదనపు కలెక్టర్ కే. అనిల్ కుమార్ స్వయంగా అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చేశారు. వరంగల్ నుంచి మెకానిక్‌ను రప్పించి రెండు గంటల్లోనే లారీని రిపేర్ చేయించి, యూరియా సీరోల్ మండలంలోని మన్నేగూడెం సొసైటీకి చేరేలా చేశారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి రైతులకు యూరియా పంపిణీ జరిగేలా పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ కృషిని రైతులు అభినందించారు. ఒక రోజు ఆలస్యమవుతుందని భావించిన యూరియా సరఫరా, కలెక్టర్ చొరవతో రెండు గంటల్లోనే రైతుల చేతికి చేరింది.






