- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధిహామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆడిట్ టీం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న, పూర్తైన పనులపై సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది.

దిశ, వరంగల్ బ్యూరో : మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆడిట్ టీం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న, పూర్తైన పనులపై సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. సంగెం, పర్వతగిరి మండలాలలో రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి, గ్రామపంచాయతీ స్థాయిలో నిర్వహణ రికార్డులను సవివరంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న 7 రిజిస్టర్‌లు, పని ప్రదేశాల్లో కూలీల హాజరు నమోదులు, జాబ్ కార్డుల అప్డేట్ స్థితి, వర్క్‌సైట్ బోర్డులు, క్యాష్ బుక్స్ తదితర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా పనులు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి నాణ్యత, పారదర్శకత అంశాలను పరిశీలించారు. కేంద్ర ఆడిట్ బృందంలో అమిత్ శ్రీవాత్సవ్ (టీం లీడర్), పరాష్ శర్మ, మోహిత్ కుమార్, మధుసూదన్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుండి మురళి రఘువీర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను బృందం సమగ్రంగా వివరించింది. అమలులో ఉన్న విధానాలు, రికార్డు నిర్వహణ, పారదర్శకత మరియు పనుల నాణ్యతపై తమ పరిశీలనలను కలెక్టర్ ముందుంచారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌డీఓ రామ్ రెడ్డి, ఏపీడీ శ్రీవాణి, వివిధ మండలాల ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






