- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33), వరికోత యంత్ర డ్రైవర్‌గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో సంచరిస్తూ ఉండేవాడు.

దిశ, టేకుమట్ల : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33), వరికోత యంత్ర డ్రైవర్‌గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో సంచరిస్తూ ఉండేవాడు. ఈ నెల 18న జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు వచ్చి మద్యం సేవించిన అనంతరం, వైన్ షాప్ ముందు నిలిపి ఉంచిన ఒక మోటార్ సైకిల్‌ను దొంగిలించి, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామం వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద టేకుమట్ల గ్రామానికి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళను తన బండిపై ఎక్కించుకొని ఆరేపల్లి వైపు తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో వాహనం ఆపి, ఆమెను చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి భౌతిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె పై బలవంతంగా లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించి పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టగా.. 22.04.2026 సాయంత్రం చిట్యాల పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన మోటార్ సైకిల్‌తో పాటు బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు చిట్యాల సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి. మల్లేశ్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టేకుమట్ల ఎస్ఐ అమూల్య, సిబ్బంది మహేందర్, రామకృష్ణలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ అభినందించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి. మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మకుండా, సాధ్యమైనంతవరకు ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.






