ఆరూరి రమేష్ రాక‌పై తాటికొండ రాజయ్య రియాక్ష‌న్ ఇదే

by velandi.Saikiran |

ఆరూరి రమేష్ తన వ్యక్తిగత కారణాలతో పాటు అనుచరుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే డా రాజయ్య.

ఆరూరి రమేష్ రాక‌పై తాటికొండ రాజయ్య రియాక్ష‌న్ ఇదే
X

దిశ, ధర్మసాగర్: తనకు BRS టికెట్ రాదు అంటున్నావు కదా? దమ్ముంటే నువ్వు రాజీనామా చేయ్ అంటూ కడియం శ్రీహరికి స‌వాల్ చేశారు డాక్టర్ రాజయ్య. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే డా రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నది కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మంచి నాయకులను తయారు చేసిన ఘనత తనదేనని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండానే ఎగరబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆరురి రమేష్ తన తమ్ముడిగా భావిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా

ఆరూరి రమేష్ తన వ్యక్తిగత కారణాలతో పాటు అనుచరుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే డా రాజయ్య. రమేష్‌ను తన తమ్ముడిగా భావిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని డాక్టర్ రాజయ్య వెల్లడించారు.

Next Story