- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఎగురవేశారు.

దిశ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం, మంత్రి కొండా సురేఖ హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లతో కలిసి పోలీస్ పరేడ్‌ను పర్యవేక్షించారు. వివిధ పోలీస్ విభాగాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు. అమర వీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సన్మానించిన మంత్రి, వారి త్యాగాలను గుర్తు చేశారు. వివిధ శాఖల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటిని తయారుచేసిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి. పలువురు పోలీస్ అధికారులకు మంత్రి చేతుల మీదుగా సేవా పతాకాలు అందజేశారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జీ డబ్ల్యూ ఎమ్ సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలకు ముందు, అదాలత్ జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీరులకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు.






