- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ కార్యాలయంలో దళారులదే రాజ్యం..!
ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడం కోసమే ఉన్నాయి. కానీ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల తహశీల్దార్ కార్యాలయం మాత్రం దళారుల అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, ధర్మసాగర్ : ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడం కోసమే ఉన్నాయి. కానీ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల తహశీల్దార్ కార్యాలయం మాత్రం దళారుల అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పని కావాలంటే నేరుగా అధికారుల వద్దకు వెళ్లడం కాదు, ముందుగా దళారులను సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొంది. మ్యుటేషన్, సక్సేషన్, భూభారతి వంటి కీలక భూ సంబంధిత అప్లికేషన్లు కదలాలంటే దళారుల ద్వారా డబ్బులు ముట్టాల్సిందే అన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దళారులు తెచ్చిన ఫైళ్ళకే ప్రాధాన్యం ఇస్తూ, సాధారణ ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకున్న ఫైళ్ళు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలానా దళారిని కలిసి వచ్చాను తను పంపిస్తేనే వచ్చాను అని చెప్తే వారికి ఇచ్చే మర్యాద వేరేలా ఉంటుందని పలులవురు సామాన్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారి పనులు మాత్రం కొద్ది రోజుల గడువులోనే పూర్తి అవుతుండగా.. ఇవ్వని వారి ఫైళ్ళు “పరిశీలనలో ఉన్నాయి”, “పై అధికారుల అనుమతి కావాలి” అంటూ కాలయాపన చేయడం సర్వసాధారణంగా మారిందని సమాచారం. ఈ పరిస్థితి తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఆర్డీవో కార్యాలయం వరకు వ్యాపించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆర్డీవో కార్యాలయంలో అదే పరిస్థితి..!
తహశీల్దార్ విచారణ చేసి ఆర్డీవో అనుమతి కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపిన ఫైల్స్ పరిస్థితి సైతం అలాగే ఉంది. తహశీల్దార్ విచారణ చేసి తర్వాత కూడా ఆర్డీవో కార్యాలయంలో నెలల తరబడి పెండింగ్ లో ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. భూభారతి ద్వారా భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు, భూమి యజమానులు వాపోతున్నారు. దళారుల చేతిలో వ్యవస్థ బందీ అయిందని, నిజమైన అర్హులైన ప్రజలకు న్యాయం జరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధర్మసాగర్ తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న దళారులు వ్యవస్థపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






