కాళేశ్వరంలో పటిష్ట బందోబస్తు

by Ratna Kumari |

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా కాళేశ్వ‌ర ముక్తేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానంలో నిర్వ‌హిస్తున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు.

కాళేశ్వరంలో పటిష్ట బందోబస్తు
X

దిశ, మహదేవపూర్ : మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా కాళేశ్వ‌ర ముక్తేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానంలో నిర్వ‌హిస్తున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున పోలీస్ బందోబస్తును మరింత పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ తెప్పోత్సవం జరుగు ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలను ప‌రిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కట్టు దిట్టంగా అమలు చేయాలని, అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు సక్రమంగా నిర్వహించి, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పార్కింగ్‌ను నిర్ణయించిన ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలని, గుడి పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. సీసీటీవీ పర్యవేక్షణతో పాటు డ్యూటీలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

Next Story