- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ పై రాళ్ల దాడి.!
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. 9 వార్డు శనిగపురం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుధా మోహన్ గెలుపు సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చెయ్యడం కలకలం రేపింది.

బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ పై రాళ్ల దాడి.!
ఒకరికి తీవ్ర గాయాలు… వరంగల్ ఎంజీఎంకు తరలింపు.!
దిశ, మహాబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. 9 వార్డు శనిగపురం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుధా మోహన్ గెలుపు సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చెయ్యడం కలకలం రేపింది. బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తుండగా, చీకటి సమయంలో అకస్మాత్తుగా రాళ్లు విసిరినట్లు సమాచారం.ఈ దాడిలో బీ.ఆర్.ఎస్ కార్యకర్త పరమ్ సింగ్ (52) తలకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఆయనను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించిగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం కీ తరలించినట్టు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై ఆరోపణలు చేస్తుండగా, కాంగ్రెస్ వర్గాలు తమకు సంబంధం లేదని చెబుతున్నాయి. పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.






