- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన ఈత సరదా.. బాలిక మృతి
ఈత సరదా ఓ కుంటుబాన్ని దుఃఖ సాగరంలో ముంచింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన బాలిక నీట మునిగి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటు చేసుకుంది.

దిశ, కొత్తగూడ : ఈత సరదా ఓ కుంటుబాన్ని దుఃఖ సాగరంలో ముంచింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన బాలిక నీట మునిగి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, గంగారం మండల ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం మండలంలోని బుధువారం కాటినగరం గ్రామానికి చెందిన నరేష్, యశోదల కూతురు మూతి శ్రావణి (12) తన స్నేహితులతో కలిసి కోమట్లగూడెం గ్రామ శివారులోని పెద్ద చెరువుకు ఈతకు వెళ్లింది.
అయితే.. స్నేహితులతో కలిసి చెరువులోకి దిగిన శ్రావణి, అకస్మాత్తుగా నీటి గుంతలో చిక్కుకుని మునిగిపోయింది. వెంటనే స్నేహితులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా, వారు చేరుకునేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరదాగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన బాలిక ప్రమాదవశాత్తు చెరువు మింగేయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
విద్యార్థులు జాగ్రత్త - ఎస్సై రవికుమార్
పిల్లలు ఈత నేర్చుకోవడానికి వెళ్ళటపుడు తప్పనిసరిగా తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. తల్లిదండ్రులు గాని, ఇతర కుటుంబ సభ్యులు కానీ లేనిపక్షంలో ఈతకు వెళ్లొద్దు. ఈత నేర్చుకునే క్రమంలో జాగ్రత్తలు పెద్దలు తీసుకోవాలని హెచ్చరించారు.






