సరస్వతి పుష్కరాలకు వెళ్తుంటే ప్రమాదం.. ఇద్దరు మృతి

by Bhanu |

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లి - కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సరస్వతి పుష్కరాలకు వెళ్తుంటే ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌ డెస్క్‌ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లి - కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సరస్వతి పుష్కరాల కోసం వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న జైలో మహేంద్ర కారు, ఆటో ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం భక్తులు సరస్వతి పుష్కరాల కోసం కాళేశ్వరం వైపు వెళ్తుండగా, జాతీయ రహదారిపై అకస్మాత్తుగా ఈ ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోను జైలో మహేంద్ర కారు వేగంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం చేస్తూ వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. గాయపడిన 15 మంది క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో జిల్లా వంద పడకల ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన వాహనాల శిథిలాలను తొలగించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story