- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభ్యులకు రూ. 3 కోట్ల బోనస్ పంపిణీ
ముల్కనూరు సహకార సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఘనంగా బ్యాంక్ 69వ మహాసభ

సభ్యులకు రూ. 3 కోట్ల బోనస్ పంపిణీ
ముల్కనూరు సహకార సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి
ఘనంగా బ్యాంక్ 69వ మహాసభ
దిశ భీమదేవరపల్లి: మండలం లోని ముల్కనూర్ లో రైతుల కోసం1956లో దివంగత కాశీ విశ్వనాథరెడ్డి రైతులతో కలిసి 'ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు'ను స్థాపించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, సహకారోద్యమానికి ఆదర్శంగా నిలుస్తున్న ముల్కనూరు సొసైటీ 69వ వార్షిక మహాసభ శుక్రవారం సంఘం పార్ బాయిల్డ్ రైస్ మిల్లు ఆవరణలోని సభ వేదికలో నిర్వహించారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సొసైటీ అధికారితో సంఘం నివేదికను చదివి వినిపించారు. తెలంగాణ ప్రాంతంలో కరువు నేలలో సాగునీరు, తాగునీరు లేక రైతన్నలు కష్టాల్లో అల్లాడి పోయిన రోజులు ఉన్నాయి. 373 మంది, ఒక్క ఉద్యోగి, రూ.100 వాటా ధనంతో ప్రారంభమైన సంస్థ నేడు 7,641 మంది సభ్యులతో, 132 మంది ఉద్యోగులతో, రూ.40 కోట్ల స్థిరాస్తులతో లాభాల బాటన నడుస్తుంది. గతంలో ఈ బ్యాంకుకు దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సంస్థ ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంగా మారింది.
అనంతరం పాత్రికేయులతో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతుల కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముందున్నామని పేర్కొన్నారు. సీనియర్ సభ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, గృహ, విద్య, వైద్య రుణాలు అందించడం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. 2024 25 సంవత్సరంలో ఖరీఫ్ లో ఖరీదు చేసిన సభ్యులు వ్యవసాయ ఉత్పత్తులు ఎస్ఎఓ ఎంటిఓ (ఎలక్ట్రానికల్ మోటర్ పైప్ లైన్) అప్పులకు జమ చేసుకున్న వారికి లోకల్ సన్నాలు బిపిటి, ఆర్ఎన్ఆర్ కింటాకు 200/- ఖరీఫ్ సీజన్ కు మాత్రమేనని లోకల్ దొడ్డు రకాలకు కింటాకు 100 రూపాయలు వరి విత్తనాలు సన్నాలు క్వింటాకు 200 ఖరీఫ్ సీజన్ కు వరి విత్తనాలు దొడ్డు రకాలపై 125, పత్తి పై 300/- బోనస్ చెల్లించినట్లు తీర్మానించామని తెలిపారు. నికర లాభం ఎనిమిది కోట్లు, సంఘం సభ్యులకు మూడు కోట్ల బోనస్ పంపిణీ చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య కార్యవర్గ సభ్యులు గనబోయున శ్రీనివాస్, కాశిరెడ్డి వసంత, బొల్లంపల్లి కుమార్ స్వామి, అంబాల రాములు, బేల కనకమ్మ, కర్రె మహేందర్, కంది రవీందర్ రెడ్డి, మండ శ్రీనివాస్, చేవల్ల బుచ్చయ్య, ఈర్ల మూగయ్య, గూగుల్ భాషు, గుర్రాల భాస్కర్ రెడ్డి, బొల్లెపెల్లి వీరారెడ్డి కార్యనిర్వాణా అధికారులు జనరల్ మేనేజర్ మారుపాటి రామ్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.






