- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలి
by Ratna Kumari |
వెంకటాపురం మండలం మురుమూరు నుంచి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేయాలని, రోడ్డు పనులను నాసిరకంగా చేసిన పక్షంలో చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ అన్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : వెంకటాపురం మండలం మురుమూరు నుంచి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేయాలని, రోడ్డు పనులను నాసిరకంగా చేసిన పక్షంలో చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ అన్నారు. గురువారం ఏటూరు నాగారం ఏఎస్పి మనన్ భట్ తో కలిసి కర్రె గుట్టలను సందర్శించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను అదనపు కార్మికులను నియమించుకొని 24 గంటల పాటు కొనసాగించాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






