రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అధికారి

by Bhanu |

మండలంలోని రెవిన్యూ కార్యాలయంలో ఓ అధికారి ఏళ్ల తరబడి తిష్ట వేసి మండలాన్ని శాసిస్తున్నాడు.

రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అధికారి
X

దిశ, కన్నాయిగూడెం : మండలంలోని రెవిన్యూ కార్యాలయంలో ఓ అధికారి ఏళ్ల తరబడి తిష్ట వేసి మండలాన్ని శాసిస్తున్నాడు. రెవెన్యూ కార్యాలయంలో ఏ గ్రామం నుంచి ఏ భూమికి సంబంధించి,పహాని మొదలుకొని ఏ సర్టిఫికెట్లు అయినప్పటికీ రెవెన్యూ కార్యాలయం నుండి పొందాలంటే ఆదికారికి ముడుపులు చెల్లించాల్సిందే లేదంటే ఆ పని కానట్లే..ఆ అధికారి మండలంలోని వివిధ గ్రామలలో గిరిజన,గిరిజనేతర్ల అమాయకత్వం ఆసరాగా చేసుకొని నూతనంగా పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు త్వరగా రావాలంటే అధికారికి 20వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం చుట్టుపక్కల అక్రమ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ ఏజెన్సీ గిరిజన 1/70 చట్టాన్ని కాపాడాల్సిన అధికారి ఏకంగా మండలంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టే వారిఫై చర్యలు చేపట్టకుండా వారిని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది.


ఏజెన్సీ గిరిజన హక్కులను కాపాడాల్సిన ఆ అధికారే 1/70 పీసా చట్టని తూట్లు పొడుతూ,గిరిజన చట్టాలు నాకేం వర్తించవు అన్నట్టుగా ఏకంగా మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం పక్కన భూమిని విక్రయించినట్టు వట్టి భూమిని బినామీ పేరుతో తీసుకున్నట్టు తెలుస్తుంది.కొనుగోలు చేసిన భూమిలో ఏకంగా 50 నుండి 60 ట్రక్కుల మట్టిని,మట్టి మాఫియా వీరుల నుంచి మట్టి ఉచితంగా పోయించుకుంటున్నట్టు తెలుస్తుంది.మండలంలో మట్టి మాఫియాకు అటు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయమే మండల వ్యాప్తంగా ప్రజలు నోట చర్చించుకుంటున్నారు. విషయం ఫై ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారిపై ఆరా తీసి చర్యలు తీసుకుంటారా..? లేదా వేచి చూడాలి మరి....

Next Story