దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. నాయ‌కుని కుంట‌ను సంద‌ర్శించిన అధికారులు

by Ratna Kumari |

మండలంలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీలో 1428 సర్వే నెంబర్లు నాయకుని కుంట గత కొంత కాలంగా కబ్జాకు గురవుతున్నార‌నే విషయాన్ని ఈనెల 3న దిశ వెబ్ సైట్ లో.. ఈనెల 4న దిశ పత్రికలో బ్యానర్ వార్త రావడంతో గ్రామస్తులు, రైతులు కలెక్టర్ స్నేహ శబరిష కు ఫిర్యాదు చేశారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. నాయ‌కుని కుంట‌ను సంద‌ర్శించిన అధికారులు
X

దిశ, బయ్యారం : మండలంలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీలో 1428 సర్వే నెంబర్లు నాయకుని కుంట గత కొంత కాలంగా కబ్జాకు గురవుతున్నార‌నే విషయాన్ని ఈనెల 3న దిశ వెబ్ సైట్ లో.. ఈనెల 4న దిశ పత్రికలో బ్యానర్ వార్త రావడంతో గ్రామస్తులు, రైతులు కలెక్టర్ స్నేహ శబరిష కు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఎట్టకేలకు అధికారులు ఇరిగేషన్ డి ఈ సాగర్, మండల తహశీల్దార్ నాగరాజు విబిజి రామ్ (ఉపాధి హామీ) ఏపిఎమ్ నరేష్ నాయకుని కుంటను సందర్శించి.. కుంట భూమి కబ్జాకు పాల్పడుతున్న రైతులతో, అధికారులు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా నాయకుని కుంట ఉన్నట్లు తమ విచారణలో తేలిందని, నాయకుని కుంట అలుగులు తూములు కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఏమైనా పని అనుమతులు కావాలంటే అధికారుల ముందస్తూ అనుమతులతోనే పనిచేయాలని , అక్రమంగా చెరువులను కబ్జాలకు పాల్పడితే లోతట్టు ప్రాంతాలకు జలము ఒప్పు ఉంటుందని దీనిని రైతులు అర్థం చేసుకొని మెదడుకోవాలని మండల తహసిల్దార్ గ్రామస్తులు రైతులతో తెలిపారు. దిశ దిశ కధనంతో అధికారులు కదిలి చర్యలకు ఉపక్రమించడంతో గ్రామస్తులు దిశా ప్రతినిధికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.

Next Story