దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. రైతుల పొలాల‌ను సంద‌ర్శించిన ఇరిగేష‌న్ డీఈ

by Ratna Kumari |

ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం.. రైతుల ఆందోళన అంటూ ఈనెల 06న దిశ వెబ్ సైట్ లో వెలువ‌డిన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. రైతుల పొలాల‌ను సంద‌ర్శించిన ఇరిగేష‌న్ డీఈ
X

దిశ‌, బ‌య్యారం : ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం.. రైతుల ఆందోళన అంటూ ఈనెల 06న దిశ వెబ్ సైట్ లో వెలువ‌డిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేర‌కు సోమవారం ఇరిగేషన్ అధికారులు అంకమ్మ బుర్ర, తునికి కాలువ కింద రబీ పంట కాలానికి నీరు జాప్యంపై వాటిని సందర్శించి, రైతుల ఆందోళన చెందవద్దని ఇరిగేషన్ డీఈ వట్టికొండ నాగార్జున సాగర్, ఏఈ పృథ్వి, అఖిల రైతుల వ్యవసాయ క్షేత్రాలకు చేరుకొని నీటిని విడుదల చేసి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ బయ్యారం పెద్ద చెరువులో 11 అడుగుల వరకు నీరు ఉన్నదని 1500 ఎకరాలకు నీరు సమృద్ధిగా అందుతుందని వంతుల వారీగా కాలువలో అడ్డుకట్టలను తొలగించి నీటిని జాగ్రత్తగా రైతులు వినియోగించుకొని పంటలు పండించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల అధికారి రాజు, ఏఈవోలు నాగరాజు ఫయాజు, లష్కర్ పాల్గొన్నారు.

Next Story