- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ డైరీలపై మత ప్రచారం.. ఆగ్రహావేశంలో తల్లితండ్రులు
పాఠశాలలో విద్య బోధించాలా.. లేక మతప్రచారం చేయాలా..? మండలంలోని కమలాపురం లోని రోజా మిస్టీకా కాన్వెంట్ హైస్కూల్ (ఆర్ఎంసీ)..

దిశ, మంగపేట: పాఠశాలలో విద్య బోధించాలా.. లేక మతప్రచారం చేయాలా..? మండలంలోని కమలాపురం లోని రోజా మిస్టీకా కాన్వెంట్ హైస్కూల్ (ఆర్ఎంసీ) పై ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ డైరీలపై ఏసు క్రీస్తు, క్రైస్తవ మత ప్రముఖుల బొమ్మలు ముద్రించి అమ్మిన యాజమాన్యం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన చిత్రాలు ముద్రించి విద్యార్థులపై మతప్రభావం చూపాలన్న యత్నంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విషయం సోమవారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విద్యార్థులు అన్ని మతాలవారైనా పాఠశాల ఓ మతాన్ని మాత్రమే ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం?’’ అంటూ పలువురు నెటిజన్లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఈ స్కూల్‌లో ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు సుమారు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరి కోసం ఇచ్చిన స్కూల్ డైరీలపై ఏసు క్రీస్తు ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న బొమ్మలు ఉండటాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది పిల్లల్లో మత భిన్నత్వాన్ని కలిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
తక్షణమే స్పందించి సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దృష్టి పెట్టాలని, ఆర్ఎంసీ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.






