- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుర పోరుకు రెడీ..
మున్సిపల్ పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: మున్సిపల్ పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగనుండడంతో ఎవరికి వారే ఆయా పార్టీల టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండటంతో ఎమ్మెల్యేలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో పోటీకి నేతలు సిద్ధం అవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవులపై నజర్ పెట్టి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు.
రిజర్వేషన్ల ఖరారు..
మున్సిపల్ పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను డిక్లేర్ చేశారు. నేడు మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓటరు తుది జాబితాను ప్రకటించిన మున్సిపల్ అధికారులు నేడు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని పరకాల, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మరిపెడ, మహబూబాబాద్, దోర్నకల్, కేసముద్రం, వర్ధన్నపేట, తొర్రూర్, స్టేషన్ ఘన్పూర్, జనగామ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మున్సిపాలిటీల పరిధిలో జనరల్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏయే రిజర్వేషన్లు ఎన్ని ఉంటాయో ప్రకటించారు. నేడు మున్సిపాలిటీల పరిధిలో వార్డుల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘం ఇచ్చిన రిజర్వేషన్లకు అనుగుణంగా వార్డుల రిజర్వేషన్లను డిక్లేర్చేయనున్నారు.
కాంగ్రెస్లో పెరిగిన పోటీ..
మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో పోటీ పెరిగింది. ఎవరికి వారే మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ కు అనుగుణంగా మున్సిపల్ చైర్మన్ సీటుపై నజర్ పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జిలు కీలకం కావడంతో వారి ద్వారా పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు దాదాపు ఖరారు కావడంతో వాటికి అనుగుణంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలపై సీట్ల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. అన్ని మున్సిపాలిటీలు గెలుచుకోవాలని సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు సూచించడంతో ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. బలమైన నేతలను గుర్తించి బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలో ఉండటం మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తుండటంతో సీనియర్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకేసారి ఒత్తిడి పెరగడంతో ఎమ్మెల్యేలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎలాగైనా మున్సిపాలిటీలలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నజర్..
ఈ ఎన్నికలను కీలకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో నజర్ పెట్టారు. పార్టీ నేతలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 మున్సిపాలిటీల్లో పోటీ కోసం ప్రయత్నాలను చేస్తున్నారు. రిజర్వేషన్ కు అనుగుణంగా అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ ల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ, వామపక్ష పార్టీల నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కీలకంగా మారనున్నాయి. ఏ పార్టీకి మున్సిపాలిటీలో ప్రజలు మద్దతిస్తారో ఎన్నికల తర్వాత తేలే అవకాశం ఉంది.






