రేషన్ గోల్ మాల్.. సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పంపిణీ

by Bhanu |

మండల కేంద్రంలోని చిన్న నాగారం రేషన్ షాపులో సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేషన్ గోల్ మాల్..  సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పంపిణీ
X

దిశ, ఇనుగుర్తి: మండల కేంద్రంలోని చిన్న నాగారం రేషన్ షాపులో సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలలోకి వెలితే నాగారం గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ 3104026 గురువారం బస్తాలలో పైన సన్న బియ్య క్రింద భాగం దొడ్డు బియ్యం ఉండటం కలకలం రేపింది. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డీలర్లు,మీటర్లు,గోదాం నిర్వాహకులు ఎవరు గోల్ మాల్ చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

రేషన్ డీలర్ వివరణ:

సన్నబియ్యం బదులు దొడ్డుబియ్యం పంపీణి చేయడం చేస్తున్నమన్నది అవాస్తవం.ఒకటి రెండు బస్తాలు పైన దొడ్డు బియ్యం రావడం జరిగింది.సన్నబియ్యం దొడ్డు బియ్యం బస్తాలను ప్రక్కన పెట్టి సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది

తహసీల్దార్ వివరణ:

సన్న బియ్యం బస్తాలో దొడ్డుబియ్యం పంపిణీ చేశారనేది మా దృష్టికి కూడా వచ్చింది.కాని సంబందిత డీలర్ మాకు సమాచారం ఇవ్వలేదు.అది డీలర్ల తప్పిదమా లేదా మీలర్లదా, గోదాం నిర్వాహకులదా అనేది విచారణలో తెలుతుంది.ప్రభుత్వాన్ని బదునాం చేసే విధంగా వ్యవరించే వారిపై తప్పక చర్యలు తీసుకుంటాం

Next Story