రేషన్‌లో మోసాల మాయాజాలం.. ఇవ్వాల్సింది 18 కిలోలు.. ఇచ్చింది 12 కిలోలు..!

by Bhanu |   (  Updated:2025-05-15 12:39:16  IST  )

ప్రభుత్వ పథకాల్లో భాగంగా పంపిణీ చేయాల్సిన బియ్యంలో భారీ మోసం జరుగుతుంది. తక్కువ బియ్యం ఇచ్చినా రికార్డుల్లో మాత్రం మొత్తం బియ్యం ఇచ్చినట్లు నమోదు చేసుకున్న సదరు ఇంచార్జి డీలర్ , విషయం తెలుసుకున్న కార్డుదారులు వెళ్ళి మాకు 18 కిలోలు రావాల్సింది ఉంది.

రేషన్‌లో మోసాల మాయాజాలం.. ఇవ్వాల్సింది 18 కిలోలు.. ఇచ్చింది 12 కిలోలు..!
X

దిశ, హనుమకొండ : ప్రభుత్వ పథకాల్లో భాగంగా పంపిణీ చేయాల్సిన బియ్యంలో భారీ మోసం జరుగుతుంది. తక్కువ బియ్యం ఇచ్చినా రికార్డుల్లో మాత్రం మొత్తం బియ్యం ఇచ్చినట్లు నమోదు చేసుకున్న సదరు ఇంచార్జి డీలర్ , విషయం తెలుసుకున్న కార్డుదారులు వెళ్ళి మాకు 18 కిలోలు రావాల్సింది ఉంది. కానీ మాకు 12కిలోలు మాత్రమే ఇచ్చారు ఎందుకు అని సదరు డీలర్ను అడిగితే బెదిరింపులకు దిగుతూ.. నేను తలుచుకుంటే మీకు కార్డు లేకుండా చేస్తా అంటూ కార్డుదారులను బెదిరిస్తున్నట్లు కార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న రేషన్ పథకం అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ పథకం అసలు ఉద్దేశానికి భిన్నంగా, అవినీతి, అక్రమాల ముసుగులో నడుస్తుండటం ప్రజల్లో ఆవేదనకు దారితీస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామానికి కొద్ది నెలల క్రితం ఇంచార్జి డీలర్ గా వెళ్ళిన సదరు వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి గత కొన్ని నెలల నుండి ఆ కుటుంబానికి 18 కిలోల బియ్యం ఇవ్వాల్సిన సమయంలో, కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే అందిస్తూ, రేషన్ డిజిటల్ రికార్డుల్లో మాత్రం 18 కిలోలు ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మీము మోసపోతున్నాం, మాకు ప్రతి నెల 18 కిలోలు రావాల్సింది ఉండగా, కేవలం 12 కిలోలు మాత్రమే ఇస్తున్నాడు అని ఆ కుటుంబ సభ్యులు వెళ్లి సదరు ఇంచార్జి డీలర్ ను అడగగా సదరు డీలర్ మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం, మీకు అస్సలు బియ్యం రాకుండా చేస్తా అంటూ బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

మోసం ఎలా జరుగుతుంది?

ప్రభుత్వం అందించే ఫ్రీ లేదా సబ్సిడీ ధర రేషన్ బియ్యం పూర్తిగా ఇవ్వకుండా, కొంత భాగం డీలర్లు దాచి ప్రైవేట్ మార్కెట్‌కి అమ్మే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం తక్కువగా ఇవ్వడం ద్వారా మిగిలిన భాగం బియ్యని సదరు డీలర్ అక్రమంగా విక్రయించబడి ప్రైవేటుగా లాభం పొందుతున్నారు. ప్రజలు అంగీకరించకపోతే, అధికార రికార్డుల్లో తప్పు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

న్యాయం అడిగితే బెదిరింపులా..?

మాకు అధికారంగా 18 కిలోల బియ్యం ఇవ్వాల్సింది ఉండగా, సదరు డీలర్ అలా ఇవ్వకుండా కేవలం 12 కిలోలు మాత్రమే ఇస్తున్నాడు అంటూ సదరు రేషన్ కార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మా యొక్క కుటుంబానికే కాకుండా గ్రామంలో చాలా మంది కుటుంబాలకు ఇలానే చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కాకుండా ప్రతి నెలా ఇదే జరుగుతోంది. చాలామంది అడగకుండానే భయంతో ఊరుకుంటున్నారు అని తెలుస్తుంది.

చట్టపరంగా ఇది ఎంత పెద్ద నేరం..?

ఈ రకం మోసాలు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ప్రివెంజన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం శిక్షార్హం. రేషన్ సరుకుల గిరాకీ అక్రమ మార్గాల్లో డైవర్షన్ చేస్తే డీలర్ లైసెన్స్ రద్దు చేసి జరిమానాలు, అరెస్ట్ వరకు జరుగే అవకాశం ఉంది. కానీ సదరు ఇంచార్జి డీలర్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Next Story