- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ పోరాటంతోనే మోదీ కులగణ ప్రకటన చేశారు : మంత్రి పొన్నం
ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా గట్టమ్మ దేవస్థానములో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ గా లీల గార్డెన్ లో జరిగిన సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.

దిశ, ములుగు ప్రతినిధి: ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా గట్టమ్మ దేవస్థానములో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ గా లీల గార్డెన్ లో జరిగిన సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యతో దేశ విచ్ఛిన్నానికి దారితీస్తున్నారన్నారు. దేశ నిర్మాణం ఉన్నతంగా జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందని,దేశంలోని వనరులు, సంపద దేశ ప్రజలందరికీ సమానంగా పంచాలని,బహుళజాతి సంస్థల కోసం ఆలోచిస్తున్నారే తప్ప దేశ ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని, రాహుల్ గాంధీ పోరాటం తోనే నరేంద్ర మోదీ కులగణ ప్రకటన చేశారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని మంత్రి సూచించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ శాసన సభ్యుడు పొదెం వీరయ్య. జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ఇంచార్జీలు కైలాష్ నేత సాంబయ్య, జిల్లా గ్రంథమాల సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






