మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-10-26 04:43:19  IST  )

మద్యంమత్తులో తనను తాను పొడుచుకుని హల్ చల్ చేశాడో సైకో. ఉదరం, తల, చేతులపై పొడుచుకుని గాయపరచుకున్నాడు. అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు.

మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం
X

దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో సైకో (Psycho Hulchal) వీరంగం సృష్టించాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె సమీపంలో ఈ ఘటన జరిగింది. మద్యంమత్తులో తనను తాను పొడుచుకుని హల్ చల్ చేశాడు. ఉదరం, తల, చేతులపై పొడుచుకుని గాయపరచుకున్నాడు. అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Next Story