- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

అగ్నిప్రమాదంలో ఆస్తి దగ్దం
- కాలిపోయిన గృహోపకరణాలు
- ప్రమాదంలో రూ.2లక్షల ఆస్తి నష్టం
- బోరున విలపిస్తున్న బాధిత కుటుంబం
దిశ, మహదేవపూర్ : మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తినష్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్ల దేవేందర్ ఇంట్లో రాత్రి 2:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో ఆయన జీవనోపాధిగా నడుపుతున్న పిండి గిర్ని, కారం గిర్ని, బియ్యం గిర్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిని నడిపే మోటార్‌తో పాటు ఇంట్లో ఉన్న దర్వాజలు, కుర్చీలు, రేకులు, వర్క్ కవర్ పట్టాలు, విద్యుత్ తీగలు అన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దగ్దమైన ఆస్తి విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు బోరున విలపించాడు. జీవనోపాధి కోల్పోయిన తాను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా అన్న ఆందోళనలో ఉన్నట్లు చెప్పాడు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని దేవేందర్ వేడుకొన్నారు.






